విశాలాంధ్ర – సీతానగరం: సింగవరం గ్రామంలో వినాయక చవితి విగ్రహాల నిమర్జన ఊరేగింపు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం సింగవరం గ్రామంలో వినాయక విగ్రహం ఊరేగింపులు కొంత మంది ఆకతాయిలు కత్తుల, గొడ్డళ్లతో నృత్యాలు చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తూ ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. దీనితో ఈ పోస్టులు తక్కువ సమయంలోనే వైరల్ గా మారి పోలీసులకు చేరాయి. దీనితో పోలీసు అధికారులు స్పందించి 9 మంది ఆకతాయిలు పై బి ఎన్ ఎస్ 292, బైండోవర్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది అని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వివాదాస్పదంగా మారిన వినాయక నిమర్జనం
- Advertisement -
RELATED ARTICLES


