విశాలాంధ్ర – నిడదవోలు : శ్రీ కోటసత్తెమ్మను దర్శించుకునేందుకు దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లతో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయంలోఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న దసరా వేడుకలకు సంబంధించి గోడపత్రికను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దసరా వేడుకల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ కోటసత్తెమ్మ ను దర్శించుకునే భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్, ఆలయ ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ,కూటమి నాయకులు పాల్గొన్నారు.
శ్రీ కోట సత్తెమ్మ ఆలయంలో ఘనంగా దసరా వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


