విశాలాంధ్ర -కొవ్వూరు :కొవ్వూరులో జరిగిన జనసేన టిడిపి కొట్లాట వివాదంపై ఆదివారం దొమ్మేరు గ్రామంలో కొవ్వూరు ఏఎంసీ డైరెక్టర్ గంగుమళ్ళ స్వామి ఇంటి దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు.ఈనెల ఎనిమిదో తేదీన కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీకి చెందిన కొవ్వూరు ఏఎంసి డైరెక్టర్ గంగుమల్ల స్వామి ని, మై గాపుల బాలకృష్ణ ను కొంతమంది తెలుగుదేశం పార్టీ యువకులు కొట్టారని, ఆ విషయంపై ఆ రోజు రాత్రి గంగుమళ్ల స్వామి దొమ్మేరు గ్రామంలో తన ఇంటి వద్ద టెంట్ వేసి న్యాయం చేయాలని జనసేన నాయకులతో కలిసి తమకు న్యాయం చేయాలని కూర్చోవడం జరిగింది. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోజు రాత్రి గంగుమళ్ల స్వామి దగ్గరికి వచ్చి నేను నీకు న్యాయం చేస్తానని చెప్పడంతో వారు తొమ్మిదో తారీఖు ఉదయం మంత్రి కందుల దుర్గేష్ వద్దకు నిడదవోలు వెళ్లి మంత్రి కందుల దుర్గేషన్ కలిసి విషయం అంతా చెప్పడం జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ నేను మీ నాయకులతో మాట్లాడతానని మీకు న్యాయం చేస్తానని వారికి తెలియజేశారు . ఈనెల 8 తారీకు నుండి 14వరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదని ఏ నాయకులు నాతో మాట్లాడలేదని, అంటూ ఆదివారం ఉదయం 10:30 గంటలకు గంగుమళ్ల స్వామి మరల దొమ్మేరులో తన ఇంటి వద్ద టెంట్ వేయడం జరిగింది. సమస్య తేలక పోతే ఆ రోజు కొట్టినప్పుడు చిరిగిపోయిన చొక్కా వేసుకుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని గంగమళ్ల స్వామి తెలియజేశారు ఈ విషయాన్ని అనంతరం కూటమి నాయకులు జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు పర్యాటక,సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్,జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు కొవ్వూరు నియోజకవర్గానికి శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తో జనసేన నాయకులు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన దాడిపట్ల చర్చించడానికి మూడు రోజులలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్యుతరామయ్య (అచ్చి బాబు ) సమక్షంలో ఈ సమావేశం జరుగునున్నది. జనసేన నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజవర్గ మూడు మండలాల జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జనసేన టిడిపి వివాదంపై సమావేశం
- Advertisement -
RELATED ARTICLES


