Homeఆంధ్రప్రదేశ్అయేషా మీరా హత్య కేసులో తల్లిదండ్రుల ఆవేదన

అయేషా మీరా హత్య కేసులో తల్లిదండ్రుల ఆవేదన

- Advertisement -

భారత్ లో ప్రజా విశ్వాసం కోల్పోతున్న సి. బి ఐ..

సమర్థవంతమైన నేర పరిశోధన సంస్థ కోసం ప్రజలు ఎదురు చూపులు ..

నాడు అయేషా మీరా ! నేడు సుగాలి ప్రీతి మరెందరో అబలాలు .
… మేడా శ్రీనివాస్

విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : స్వయం ప్రతిపత్తి గల నేర పరిశోధన వ్యవస్థలు కావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి ) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు . సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎన్ టి ఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మహిళల వసతి గృహంలో నేటికి 18 సంవత్సరాల క్రితం అత్యంత పాసవికంగా హత్యకు గురైన ఘటనలో నేటికి న్యాయం జరగలేదని మృతురాలి తల్లిదండ్రులు ఘోర విచారంలో వున్నారు . ఎంతో బంగారు భవిష్యత్ గల ఆ బి-ఫార్మసి విద్యార్ది హత్య మన పాలకులకు, ప్రభుత్వాలకు అక్కరలేక పోయింది. నేటికి 18 ఏళ్లు కావొస్తున్నా ఆ తల్లిదండ్రులు ఘోష వినే సమయం , ఓపికా సైతం మన పాలకులకు అవసరం లేకపోయింది. ఆయాషా మీరా కేసును కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకున్న రాజకీయ ప్రబుద్దులు నాటి ఉమ్మడి రాష్ట్రం నుండి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు కాలయాపన చేస్తూనే ఉన్నారు . ఆయాషా మీరాకు జరిగిన అన్యాయం పట్ల విద్యార్ది లోకం కూడా సరైన రీతిలో స్పందించ లేక పోయింది . అందుకు కారణాలు కూడా లేక పోలేదు. కొంతమంది సినిమా వాళ్ళు, కుల, మత ఉన్మాదుల స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పై విషం చిమ్మటమే అందుకు గల కారణం అని ఆయన పేర్కొన్నారు . భారత్ లో న్యాయం అంగడి సరుకులో ఒక వస్తువు వలే మారిపోయింది . న్యాయస్థానాలు సైతం కాలయాపన తీర్పుల కారణంగా బాధితులు విసిగి పోతున్నారు . న్యాయం ఖరీదైనదిగా మారటం కారణంగా బాధితులు అత్యున్నత న్యాయస్థానాల గడపకు చేరుకోలేకపోతున్నారు . ఉచిత సహాయ న్యాయ కేంద్రాలు ఉన్నప్పటికి ఫీజు లేని సేవలు అందించటానికి అంతగా ఆశక్తి చూపలేకపోతున్నారు . న్యాయ సహాయంలో ఒక తరహా సీరియస్ ను కనపరచ లేక పోతున్నారు . ఇక సి.బి.ఐ. పనితీరు విషయంకు వస్తే ఆ సంస్థ యొక్క నేర పరిశోధన లో వందలు , వేల దస్త్రాలను ప్రత్యేక న్యాయస్తానాలకు సి. బి. ఐ. సమర్పిస్తుంది . అలాంటి బారి దస్త్రాలు దాఖలు చేసిన కేసుల్లో కూడా న్యాయస్థానాల్లో కేసులు వీగిపోతున్నాయి . నేర పరిశోదనలో లోపాలు ఉన్నాయా ! లేక న్యాయస్థానాలు చెప్పే తీర్పులలో లోపం వుందా అనే అంశంపై అత్యధిక భారతీయులు నిత్యం అంతర్మదనం చెందుతున్నారు . కొట్టి వేయబడిన కేసులకు విలువైన పాలనా సమయం, పాలనా పరమైన ఖర్చు , ముద్దాయిలు , బాధితుల సమయం వెలకట్టలేనిది కాదంటారా ! నేటి వరకు సి. బి. ఐ చేపట్టిన కేసుల్లో సత్వర న్యాయం పొందిన భాదితులు మన దేశంలో ఉన్నారా ! 27 తేది డిసెంబర్ 2007 లో ఆయాషా మీరా హత్యకు గురి కాగా ఆగస్టు 2008 సత్యంబాబు అనే అనుమానితుడును పోలీస్ లు అరెస్ట్ చేసారు . విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యంబాబుకు జీవితఖైదు విధించారు . 2017 మార్చి 31 న హై కోర్టు సత్యంబాబును నిర్ధాషిగా విడుదల చేసింది . అయేషా మీరా తల్లిదండ్రులు హై కోర్టును ఆశ్రయించగా కేసు ధర్యాప్తును సి. బి. ఐ.కి బదిలి చేసారు . 2018 లో పునః దర్యాప్తు చేపట్టి 6 సంవత్సరాల 6 నెలల అనంతరం మన అత్యున్నత సి బి ఐ సంస్థ హై కోర్టులో దర్యాప్తు నివేదికను దాఖలు చేసింది . మృతురాలు తల్లిదండ్రులకు నివేదిక ప్రతులను ఇవ్వటానికి నిరకరించారు . ఈ అధికార దుర్వినియోగంపై తల్లిదండ్రులు హై కోర్టును ఆశ్రయించగా దిగువస్థాయి కోర్టులో తేల్చుకోమని సూచించిన మీదట విజయవాడ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినా నేటి వరకు తల్లిదండ్రులకు ఏ విధమైన ఊరట లభించలేదని ఆయన మనస్థాపం చెందారు .ఇంత పెద్ద స్థాయిలో
సి బి ఐ అధికార దుర్వినియోగ విధులు సాగుతున్న క్రమంలో మృతురాలి తల్లిదండ్రులు కు నేడు సి బి ఐ కార్యాలయం నుండి నోటీసులు జారి చేసారు . ఏ నమ్మకంతో బాధిత తల్లిదండ్రులకు సి బి ఐ నోటీసులు జారిచేసింది. ఆ సంస్థపై ఏ విధమైన విశ్వాసం ఉంటుంది . మన ప్రభుత్వాలు ఒక మెడికల్ విద్యార్థి హత్య చేదించటంలో ఇప్పటికి 18 ఏళ్లు కావొచ్చినా ఫలితం శున్యం . భారతదేశంలో స్వయం ప్రతిపత్తి గల సమర్థవంతమైన నేర పరిశోధన సంస్థ అవసరం ఎంతైనా వుంది . రాజకీయ పాలకులకు కీలుబొమ్మగా ఉన్నటువంటి ప్రస్తుత నేర పరిశోదన సంస్థల కారణంగా సామాజిక భద్రతకు , దేశ భద్రతకు పెను ప్రమాదం పొంచి వుందని ప్రజలు గుర్తించాలి . చట్టం నిర్భందిస్తుంది . న్యాయం వదిలేస్తుంది లోపం ఎక్కడుందో మన పాలకులు గ్రహించలేక పోతున్నారా ! దురదృష్టం ఏమిటంటే మన పాలకుల్లో అత్యధికులు నేరారోపణలు గలవారు కావటం విశేషం . ఒక న్యాయం పొందటానికి మృతురాలు తల్లిదండ్రులు 18 ఏళ్లు పై భడి ఎదురు చూపులు చూడటం భారతదేశ సార్వభౌమది కారానికి మాయని మచ్చగా వుంటుందని బావించాలేని కుళ్ళిన పాలకులు మధ్య ప్రజలు బ్రతకాల్సి వస్తుందని ఆయన తెలిపారు .
నాటి అయేషా మీరా హత్య కేసును చెందించటంలో అసమర్ధతను చాటుకున్న మన నేర పరిశోధన సంస్థలు పనితీరు తీవ్ర ఆక్షేపణకు గురవుతుంది . అత్యంత పాశవికంగా బి – ఫార్మసి విద్యార్థి ఆయాషా మీరా ను అతి క్రూరంగా అవయవాలు గాయపరిచి సీరిబెల్ డెత్ స్టేజిలో కూడా అఘాయిత్యం జరిపి హత్య చేసిన నేరాన్ని నిరూపించ లేక పోవటం సిగ్గు మాలిన చర్యగా గుర్తించాలి. ఈ నేరాన్ని నిరూపించగల ఏ ఒక్క అధికారి మన భారతదేశంలో లేరా ! ఇప్పుడు జారి చేసిన సి బి ఐ నోటీసులు ,
సి బి ఐ స్పెషల్ కోర్టు విచారణ ఎప్పటికి తెలునో , ఒక వేళ తెలీనా అప్పిళ్ళు పై అప్పిళ్ళు తో ఆ తల్లిదండ్రులు తీర్పును చూడగలరా ! మన చట్ట సభల్లో ఏ ఒక్క ప్రజా ప్రతినిధి ఈ అంశంపై చర్చ చేసిన సందర్బం లేక పోవటం బాదాకరం . అయేషా మీరా హత్య ను చెందించ లేని మన చేతకాని దద్దమ్మ పాలకులు సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తారా ! ఆంధ్రప్రదేశ్ లో యువత మత్తుకు బానిసలుగా మారిపోయారు . నేపాల్ లో ఒక బాలికను ఒక ఆమాత్యుడి వాహనం గుద్ది వెళ్లిన ఘటనలో పాలకుల తీరుకు వ్యతిరేకంగా ఉవ్వేత్తున లేచిన ప్రజా తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్ అయేషా మీరా , సుగాలి ప్రీతి, ఒక శ్రీ లక్ష్మి , ఒక పసి బాలికను నిప్పుల కోలుములో కాల్చినా మన ఆంధ్రుల్లో నరాలు చచ్చుబడి పోతున్నాయి . ఒక్కసారి గతించిన ఆంధ్రుల పౌరుషం పుణికి పుచ్చుకుంటే నేటి పాలకులకు ఒక శ్రీలంక , బంగ్లాదేశ్ , మయన్మార్ , నేపాల్ ప్రజా తిరుగుబాటుకు మించి ఉప్పెన కనపడుతుందని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు .సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , ఎమ్ డి హుస్సేన్ , వల్లి శ్రీనివాసరావు , చల్లా సాంబశివరావు, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , పసుపులేటి వీర్రాజు , మాసా కుశలయ్య , మాసా రాజులమ్మ , చల్లా వంశీ , పసుపులేటి సుశీల, మేకల కిరణ్ కళ్యాణ్, కాకర ప్రసాద్ , యర్రా బాల మురళి కృష్ణ , ఎమ్. యశ్వంత్, అడపా దేవుడు , తదితరులు పాల్గొనియున్నారు .

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు