విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా): పట్టణంలోని 30వ వార్డ్, భగత్ సింగ్ నగర్ కాలనీలో మంగళవారం సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 30వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మల్లికార్జున మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీలో గత ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా, కేవలం ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రణ మాత్రమే వేసి స్మార్ట్ రేషన్ కార్డును కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ వల్ల రేషన్ సమాచారం, నెలనెలా రేషన్ పంపిణీ ఏ విధంగా తీసుకున్నామో మన మొబైల్లో తెలుసు కోవచ్చు అని ప్రజలకు తెలియజేశారు. అనంతరం రేషన్ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, స్టోర్ డీలర్లు ప్రసన్న, పవన్, ప్రజలు పాల్గొన్నారు.


