విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, చేనేత, జౌలీ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు దేశం లోనే అతి పెద్దదైనా ధర్మవరం చేనేత మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అమలు పరుచుటకు కావలసిన అవగాహన కొరకు (ఎక్స్పోజర్ విజిట్) తమిళనాడు రాష్ట్రము లోని కాంచీపురం హ్యాండ్లూమ్ క్లస్టర్లో జరుగుతున్న ప్రోడక్ట్ అభివృద్ధి గురించి, స్కిల్ అప్ గ్రేడేషన్ లో వారు వాడుతున్న అదునాతన పరికరముల గురించి, అదునాతన డిజైన్ ల మార్పులు గురించి, మార్కెటింగ్ లోఉన్న ఉన్న మెలకువలు, తదితర విషయాల గురించి తెలుసుకున్నారు.
వీటితో పాటు కంచిపురం లోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు సందర్శించి, ఐక్యతను, క్రమశిక్షణకు ధర్మవరం చేనేత కార్మికులు పెట్టింది పేరు అని మరొక్క సారి లోకానికి తెలియచేసి ఈ స్టడీ టూర్ యాత్రను విజయవంతం చేసినారు.
ఈ కార్యక్రమం లో చేనేత జవులి శాఖ కమీషనర్ రేఖరాని, గుంటూరు జిల్లా ఏడి వనజ, శ్రీ సత్య సాయి జిల్లా ఏడి రామకృష్ణ, ఏడివో లు లు సుబ్బనాయుడు, శీనా నాయక్, రాజేశ్వరి, బిజెపి పార్టీ చేనేత నాయకులు గిర్రాజు నాగేష్, నేషనల్ అవార్డు గ్రహీత డిజైనర్ నాగరాజు తో పాటూ 30 మంది ధర్మవరం చేనేత కార్మికులు పాల్గొన్నారు.
దిగ్విజయంగా జరిగిన ధర్మవరం చేనేతల కాంచీపురం స్టడీ టూర్ యాత్ర
- Advertisement -
RELATED ARTICLES


