విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన 2వ, 4వ సెమిస్టర్ ఫలితాల నందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు మరొక్కసారి తమ విజయపతకాన్ని పట్టణంలో రెపరెపలాడించారని కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్ష వర్ధన్ తెలిపారు. తదుపరి కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు విద్యార్థులకు స్వీట్లు పంచి అభినందన శుభాకాంక్షలను తెలియజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ కళాశాల విద్యార్థిని ఎస్. మౌనిక 96 శాతముతో బీఎస్సీ కంప్యూటర్ నందు, పి మధుశాలిని 92 శాతముతో బీఎస్సీ బోటనీ నందు యూనివర్సిటీ ప్రథమ స్థానం, పట్టణ ప్రథమ స్థానాన్ని సాధించారని తెలిపారు. వీరితో పాటు మేఘన 92 శాతము,శ్రీజ శాతము,కౌసల్య 90 శాతము శ్రీలత 90 శాతము, మాబున్ని 87 శాతము, అమృత సాయి 86 శాతము,సౌమ్య 86 శాతము, తనూజ 85 శాతము, జ్యోతిక 84 శాతము, భావన 84 శాతము,పావని 83 శాతము, లక్ష్మీ ప్రశాంత్ 83 శాతము, బుషార 83 శాతము, అనీషా 81 శాతము మార్కులను సాధించారని, కళాశాల ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 89 శాతము గా ఉందని,ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న మా విద్యార్థులకు, అధ్యాపక బృందానికి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్, అకడమిక్ ఇన్చార్జి కృష్ణయ్య, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.
2వ , 4వ సెమిస్టర్ ఫలితాల నందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల విజయకేతనం
- Advertisement -
RELATED ARTICLES


