విశాలాంధ్ర ధర్మవరం;; ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పై నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆర్డిఓ మహేష్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించి, ఓటరు జాబితాలో చేర్పులు, తొలగింపులు మరియు సవరణలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి అర్హత గల పౌరుడు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు కావాలని, డూప్లికేట్ లేదా బోగస్ పేర్లు లేకుండా జాబితా శుద్ధి చేయాలని వారు తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు సమగ్ర, పారదర్శక , తప్పులులేని ఓటరు జాబితా సిద్ధం కావడానికి అధికారులకు సహకరించాలని ఆర్‌డీఓ విజ్ఞప్తి చేశారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌లు సమయానుసారం సమర్పించుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సదుపాయాలను వినియోగించుకోవాలని తెలిపారు.18 ఏళ్లు నిండిన యువత, మహిళలు , వెనుకబడిన వర్గాలు ఓటరు జాబితాలో తప్పక నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీలు అందించిన సూచనలు, ఫిర్యాదులను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన చర్యలు బూత్ లెవల్ ఆఫీసర్ల సహకారంతో తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ఎన్నికల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పై సమీక్ష.. ఆర్డీవో మహేష్
- Advertisement -
RELATED ARTICLES


