Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబొలెరో వాహనం ఢీకొని యువకుడు మృతి

బొలెరో వాహనం ఢీకొని యువకుడు మృతి

- Advertisement -

విశాలాంధ్ర-నంబులపూలకుంట: మండల పరిధిలో జిల్లా సరిహద్దు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు.స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం – పల్లెనివారిపల్లి గ్రామానికి చెందిన పల్లెని గంగాధర్ నాయుడు (35) గాలివీడు మండలం ఇందుకూరుపల్లి వద్ద గల పెట్రోల్ బంక్‌లో డీజిల్ తీసుకుని వస్తున్నాడు. ఈ క్రమంలో వెలిగల్లు సమీపంలోని జిల్లా సరిహద్దు వద్ద మలుపు దగ్గర వెనుక నుండి టమోటా లోడుతో వస్తున్న బొలెరో వాహనం అతడిని ఢీకొట్టింది. గంగాధర్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించనున్నట్లు ఎస్సై వలీబాషా తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు