Homeజిల్లాలుఅనంతపురంవ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన టిడిపి నాయకులు

వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన టిడిపి నాయకులు

- Advertisement -

విశాలాంధ్ర…..డీ హి రే హల్… రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండలంలోని టిడిపి నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ను కలిసి రాయదుర్గం నియోజవర్గం సమస్యలను వివరించారు. రాయదుర్గం మార్కెట్ యార్డ్ విషయమై కమర్షియల్ కాంప్లెక్స్ లు, రైతు విశ్రాంతిభవనం, కనేకల్లులో అసంపూర్తిగా నిలిచిపోయిన సబ్ మార్కెట్ యార్డ్ సంబంధించిన సమస్యలపై చర్చించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఒక వారంలోపు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ యు.హనుమంత్ రెడ్డి, మండల్ కన్వీనర్ మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దొడగట్ట రామాంజనేయులు, నాగరాజు, ధనుంజయ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు