- Advertisement -

విశాలాంధ్ర బుక్కపట్నం.. మండల కేంద్రమైన బుక్కపట్నం గ్రామంలో మంగళవారం రాత్రి ఘరానా చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో నివాసముంటున్న సబితమ్మ అనే మహిళా గత 15 రోజులుగా ఇంటికి తాళం వేసి కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇంటిలో ఎవరూ లేరన్న విషయాన్ని గమనించిన దుండగులు మంగళవారం రాత్రి ఇంటి తాళం పగలగొట్టి ఇంటిలోనే దాదాపు 80 గ్రాముల బంగారు, 230 గ్రాముల వెండి దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు మాత్రం 20 తులాల బంగారు, మూడు కేజీల వెండి, నగదు చోరీకి గురైనట్లు వాపోయారు.


