Homeజిల్లాలుఅనంతపురంప్రతి జ్వరం కేసును ఐ డి ఎస్ పి పోర్టల్ నందు నమోదు చేయాలి

ప్రతి జ్వరం కేసును ఐ డి ఎస్ పి పోర్టల్ నందు నమోదు చేయాలి

- Advertisement -

జిల్లా మలేరియా అధికారి డి.ఓబులు

విశాలాంధ్ర – అనంతపురం : ప్రతి జ్వరం కేసును ఐ డి ఎస్ పి పోర్టల్ నందు నమోదు చేయాలి
జిల్లా మలేరియా అధికారి డి.ఓబులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక రెండవ రోడ్ మరియు ఇందిరా గాంధీ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను జిల్లా మలేరియా అధికారి ఓబులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మలేరియా, డెంగీ జ్వరాలకు సంబంధించి అక్కడి సిబ్బంది చేస్తున్న రక్త పరీక్షల గురించి ఆరా తీశారు. ప్రతి జ్వరం కేసు వివరాలను ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం( ఐ డి ఎస్ పి )పోర్టల్ నందు తప్పకుండా నమోదు చేయాలని ల్యాబ్ టెక్నీషియన్లను ఆదేశించారు. ల్యాబ్ రికార్డులను పరిశీలించారు. ఇందిరాగాంధీ పట్టణ ఆరోగ్య కేంద్రంలోని వార్డు సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో గృహ సందర్శనములు చేసి జ్వరం కేసులను గుర్తించి రక్త నమూనాలు సేకరించి వాటిని ఐ డి ఎస్ పి సర్వేలెన్సు ఫామ్ నందు ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎమ్ ఎఫ్ రిజిస్టర్ నందు నమోదు చేసిన జ్వర వివరాలు ఎస్. ఫామ్ లో నమోదు చేసే వివరాలు సమానంగా ఉండాలని తెలియజేశారు. సచివాలయ ఆరోగ్య కార్యదర్శి మరియు హెల్త్ అసిస్టెంట్లు ప్రతిరోజు ఫీవర్ సర్వే నిర్వహించాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. జ్వరం కేసులను ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేయాలన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమ కాటుకు గురికాకుండా ఉండేటట్లు అవగాహన కల్పించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ సూపర్వైజర్ నూర్ భాషా, జిల్లా మలేరియా కేంద్రంలోని ల్యాబ్ టెక్నీషియన్ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు