హెడ్మాస్టర్ సుమన
విశాలాంధ్ర – ధర్మవరం : వృత్తి విద్యతో నైపుణ్యాలు మెరుగుపడతాయని హెడ్మాస్టర్ సుమనా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని మా పాఠశాల అయిన జీవీజడ్పీగర్ల్స్ హై స్కూల్ లో ధర్మవరం 9 వ తరగతి, 10 వ తరగతి విద్యార్థులను మెరుగు పరిచేందుకు వృత్తి విద్య ఎంతో ఉపయోగ పడుతుంది అని తెలిపారు. ఇందులో భాగంగా ఒకేషనల్ విద్ధ్యార్థుల కు దసరా సెలవుల్లో సమగ్ర శిక్షణ 10 రోజులు ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం జరుగుతుంది అని తెలిపారు.ఇంటర్నషిప్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించడం జరుగుతుంది అని తెలిపారు. ఇందులో భాగంగా అపారల్ అండ్ మాడెప్స్ (ఫ్యాషన్ డిజైనింగ్) ఒకేషనల్ ట్రెయినర్స్ పి. కళ్యాణి, జిల్లా ఒకేషనల్ కోఆర్డినేటర్స్ అయినటువంటి కృష్ణ చైతన్య , మధు, మనోహర్ ఇంటెన్షిప్ జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి ,విద్యార్థులకు తగిన సూచనలు అందించారు అని తెలిపారు.
వృత్తి విద్య తో నైపుణ్యాలు మెరుగు
- Advertisement -
RELATED ARTICLES


