శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ 2వ & 4వ సెమిస్టర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు
విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రకటించిన 2వ ,4వ సెమిస్టర్ ఫలితాలలో స్థానిక ఎల్. పి. సర్కిల్ లోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సెకండ్ ఇయర్ బీకాం ,గ్రూపు నందు హజీరా, భాను:96.6 శాతము,చంద్రిక:95 శాతము,అమ్రిన్:94 శాతము , ద్వితీయ బి బి ఏ గ్రూపు నందు అమృత వర్షిణి:91 శాతము,షబానా:89 శాతము, అపర్ణ:88 శాతము, ద్వితీయ బిఎస్సిగ్రూపు నందు శ్రీలక్ష్మీ ప్రసన్న:78 శాతము,జీవిత :75 శాతము,ప్రత్యూష:75 శాతము, తృతీయ బి బి ఏ, గ్రూపు నందు యాస్మిన్:94 శాతము, హిమబిందు:89 శాతము,కళ్యాణి:87 శాతము, తృతీయ బీకాం, గ్రూపు నందు అనూష:91 శాతము,జ్యోతి:90 శాతము, మౌనిక:90 శాతము, తృతీయ బిఎస్సి, గ్రూపు నందు పి. ధరణి:80 శాతము, అర్షియా:79 శాతము,వైష్ణవి:78 శాతములతో యూనివర్సిటీ టాపర్స్ గా నిలిచిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అభినందించారు.కేవలం అత్యధిక మార్కులనే గాక ఓవరాల్ 100 శాతమురిజల్ట్స్ ని ఏ కోణంలో విశ్లేషించిన” శ్రీ పద్మావతి”విద్యా వైభవం ప్రస్ఫుటంగా సాక్షాత్కరించింది అని తెలిపారు.ఇంతటి ఘన విజయానికి కారణమైన తల్లి తండ్రులకు మరియు అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలియ చేశారు.
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల ప్రతిభ
- Advertisement -
RELATED ARTICLES


