విశాలాంధ్ర : శెట్టూరు (అనంతపురం జిల్లా)పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధ్యక్షుడుగా, భారతీయ జనసంఘ్ ఏకాత్మతా మానవతావాది సిద్దాంతకర్తగా, భారతీయ జనతా పార్టీ హైందవ సిద్దాంతకర్తగా చిన్నతనం నుంచి దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం, దేశ ప్రజల ఐక్యత కోసమే అహర్నిశలు పనిచేసి తన ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగినదని బిజెపి అసెంబ్లీ సీనియర్ నాయకులు భోగి నంజుండరావు పేర్కొన్నారు గురువారం మండల కేంద్రంలో బిజెపి కార్యాలయం నందు ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అలాగే ఆర్.ఎస్.ఎస్ వారపత్రిక పాంచజన్య, లక్నొ దినపత్రిక ‘స్వదేశ్’లకు సంపాదకీయులుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ హైందవ సిద్దాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మతా మానవతా వాదానికి ఆజ్యం పోసారు. తదుపరి 1968 ఫిబ్రవరి 11న ఆయన అకాల మరణం చెందినారు. ప్రతి ఒక్కరూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని యువతకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, అసెంబ్లీ సోషల్ మీడియా అధ్యక్షుడు నగేష్, మండల్ నాయకుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.-


