ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరంలో 35 కోట్ల విలువైన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం ప్రధాన కేంద్రంగా జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద రూ.35 కోట్ల విలువైన మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయబడింది అని అన్నారు.ఇది ధర్మవరం చేనేత రంగానికి గొప్ప ఆశీర్వాదం అని,ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఇలాంటి ప్రాజెక్ట్ ధర్మవరంలో ప్రారంభం,ఇది మన అందరికి గర్వకారణం అని తెలిపారు.ఈ క్లస్టర్, 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటూ చేస్తారని ఇది నోడల్ సెంటర్‌గా పని చేస్తుంది అని తెలిపారు. తదుపరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు బేస్‌లైన్ సర్వేపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.. ఈ సర్వే ఆధారంగా వివరమైన ప్రాజెక్ట్ నివేదిక ఈ క్లస్టర్ కు రూపొందించబడుతుంది అని తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన విశ్వజిత్ , జి. నాగేశ్వరరావు , టెక్నికల్ సూపర్‌వైజర్‌లు , హ్యాండ్‌లూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ హాజరై బేస్‌లైన్ సర్వేపై శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు. తదుపరి ఎంపీడీవో ఈ ప్రాజెక్ట్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ధర్మవరం చేనేత రంగానికి ప్రాచీన గౌరవాన్ని పునరుద్ధరిస్తుందని, పట్టు పరిశ్రమకు మరింత కీర్తి ని తీసుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.రాబోయే అభివృద్ధి కి ఇది మొదటి ఘట్టం గా తెలిపారు.
ధర్మవరం నందు రూ.35 కోట్ల విలువైన మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు
RELATED ARTICLES