Homeజిల్లాలుఅనంతపురం“స్టాప్ డ్రగ్స్ – స్టార్ట్ స్పోర్ట్స్ ” గోడపత్రికలను ఆవిష్కరించిన డిఎస్పి మెహబూబ్ భాష

“స్టాప్ డ్రగ్స్ – స్టార్ట్ స్పోర్ట్స్ ” గోడపత్రికలను ఆవిష్కరించిన డిఎస్పి మెహబూబ్ భాష

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం : యువతను మాదకద్రవ్యాల బారినుంచి దూరంగా ఉంచి, క్రీడల వైపు దృష్టి సారింపజేయడమే లక్ష్యంగా అవగాహన కల్పించాలని దిశ పోలీస్ డిఎస్పి మహబూబ్ బాషా పేర్కొన్నారు
స్థానిక దిశా పోలీస్ స్టేషన్ ఆవరణంలో శనివారం “స్టాప్ డ్రగ్స్ – స్టార్ట్ స్పోర్ట్స్ ” పోస్టర్‌ను దిశ డీఎస్పీ మోహబూబ్ భాష ఆవిష్కరించారు.
యువతలో మాదకద్రవ్యాల వ్యసనం పెరుగుతున్న నేపథ్యంలో, క్రీడల పట్ల ఆసక్తి పెంచి, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడం కోసం అవగాహన కార్యక్రమాన్ని ఏఐవైఎఫ్ నాయకులు చేపట్టారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మెహబూబ్ భాష మాట్లాడుతూ…డ్రగ్స్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని, సమాజ భవిష్యత్తు అయిన యువత క్రీడలు, విద్య, సృజనాత్మకత వైపు దృష్టి సారించాలని, పోలీసు శాఖ తరఫున యువతకు ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తాం” అని పేర్కొన్నారు. ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా యువజన చైతన్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ కొట్రేస, నగర అధ్యక్ష కార్యదర్శి ఆనంద్,శ్రీనివాస్, నగర సహాయ కార్యదర్శి రాంబాబు, అశోక్ సింహ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు