Homeజిల్లాలుశ్రీ సత్యసాయివృత్తి విద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగం..

వృత్తి విద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగం..

- Advertisement -

మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం;; వృత్తి విద్య విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణములోని మోడల్ స్కూల్లో చదువుతున్న తొమ్మిదవ పదవ తరగతి ఇంటర్ చదువుతున్న విద్యార్థులను మెరుగు పరిచేందుకు వృత్తి విద్యను ప్రభుత్వ ఆదేశాల మేరకు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ విద్యార్థులకు ఒకేషనల్ విద్యార్థుల కొరకు దసరా సెలవుల్లో సమగ్ర శిక్ష న లో భాగంగా 10 రోజులు ఇంటర్ షిప్ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఒకేషనల్ ట్రైనర్స్గా టీచర్ చైతన్య లక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్ మధు మనోహర్ కృష్ణ చైతన్య సందర్శించడం జరిగిందని తెలిపారు. వృత్తి విద్యను ప్రయోగాత్మకంగా పట్టణంలోని పలుచోట్ల విద్యార్థులకు స్వయంగా చూపించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు కంప్యూటర్ ఎంత ఎంబ్రాయిడరీ, వీవింగ్ ప్రాసెస్, షర్టు స్టిచ్చింగ్ తదితరములు నేర్పించడం జరిగిందన్నారు. విద్యార్థులు కూడా ఈ శిష్యుల పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు