Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోహిణి క్రీడాకారునికి వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆర్థిక సహాయం అందవేత

రోహిణి క్రీడాకారునికి వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆర్థిక సహాయం అందవేత

- Advertisement -

బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి ఈశ్వరయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సజజనగర్లో గల బిఎస్సార్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఇటీవల ఫ్లోర్బాల్ నేషనల్ గేమ్లో ప్రధమ స్థానము సాధించి ఆపై నేషనల్ స్థాయికి ఎంపికై ఇంటర్నేషనల్ గేమ్ సింగపూర్ లో పాల్గొనడానికి ఎంపికైనటువంటి రోహిణికి వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు రూ.54,616 లను తల్లిదండ్రులకు నగదును అందజేశారు. ఈ సందర్భంగా వాల్మీకి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి ఈశ్వరయ్య, ముత్యాలప్ప,జిల్లా కోశాధికారి రామకృష్ణ, వాల్మీకి ఉద్యోగుల నియోజకవర్గ అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ చదువుతోపాటు బోయ రోహిణి క్రీడల్లో కూడా అత్యుత్తమ ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనడం నిజంగా గర్వించదగ్గ విషయమని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రీడలు ఆడేందుకు లక్షలు ఖర్చు అవుతుందని ఉపాధ్యాయులు కోరగా తాము ఇవ్వడం జరిగిందని తెలిపారు. సింగపూర్ లో కూడా విజేతగా రావాలని వారు ఆకాంక్షించారు. తల్లిదండ్రులు ఉద్యోగ సంఘం నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్ అంగజాల రాజశేఖర్, నాగరాజు, చంద్రశేఖర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు