Homeజిల్లాలుఅనంతపురంట్రాఫిక్ సమస్యను పట్టించుకోని అధికారులు..

ట్రాఫిక్ సమస్యను పట్టించుకోని అధికారులు..

- Advertisement -

విశాలాంధ్ర గుంతకల్లు : స్థానిక పట్టణంలో రోజు రోజుకూ ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతోంది. రోడ్డుకు ఇరువైపులా ఫుడ్ కోర్టులు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనమిస్తూ ట్రాఫిక్కుకు పూర్తి అంతరాయం కలిగిస్తున్నారు. పాత బస్టాండ్ , ఇటీవల రైల్వే స్టేషన్ రోడ్డులో కొత్తగా షాపింగ్ మాల్ లు రావడంతో మరింత ఇబ్బందికరంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అవసరాల కోసం, ప్రయాణం కోసం ప్రజలు ఈ రోడ్డు గుండా రైల్వే స్టేషన్ కు షాపింగ్ మాల్స్ కు అధికంగా వస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ సిపిఐ పార్టీ తరఫున కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఈ విషయంలో సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలో రోడ్డు విస్తీర్ణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పాత బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డులో ఫుడ్ కోర్టులు, మోటార్ సైకిల్ లు రోడ్లపై ఎక్కువ ఉండడం ఫుడ్ కోర్ట్ లు పెట్టుకొని ఉన్నవారి వద్ద బిల్డింగ్‌ యజమానులు వేలకు వేలు బాడుగుల పేరుతో వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు బాడుగలు వేలకు వేలు తీసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పడుతోంది. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు