విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం లోని ఓ పేద కుటుంబం లో చిన్నారికి క్యాన్సర్ మహమ్మారి సోకింది. బెంగళూరు లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబానికి ఆదివారం స్థానిక ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ రూ. 50,000లు ఆర్థిక సాయం అందించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని గరీబ్ నగర్ లో నివసిస్తున్న ప్రవీన్ కుమార్ ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. వీరిది నిరుపేద కుటుంబం ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె అనూజ్ఞ 3వ తరగతి చదువుతోంది. అనూజ్ఞ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ… ప్రస్తుతం బెంగళూరులో కిడ్వై క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్సపొందుతుంది. తండ్రి నవీన్ కుమార్ కుటుంబానికి ఆపరేషన్ చేయించే స్థోమత లేదని తమకు చేతనైంత వరకు సహాయం అందించాలని గరీబ్ నగర్ వాసులతో కలిసి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగా ట్రస్ట్ సభ్యులు స్పందించి రూ. 50,000 చందాలు పోగుచేసుకొని ప్రవీన్ కుమార్ కుటుంబానికి అందించారు. అనూజ్ఞ తొందరగా కోలుకొని మన మధ్య వచ్చి మరల బడికి వెళ్ళాలని బద్దే నాయక్ ఆకాక్షించారు. సహాయం చేసిన బద్దే నాయక్ మరియు ట్రస్ట్ సభ్యులకు గరీబ్ నగర్ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి అబ్దుల్ వాహబ్, సభ్యులు సాయినాథ్,ఉపాధ్యాయులు లక్ష్మన్న, రామాంజినేయులు,వెంకటేష్, మహేష్ గరీబ్ నగర్ కాలనీ వాసులు చైతన్య తదితరులు పాల్గొన్నారు


