Homeజిల్లాలుఅనంతపురంపేకాట రాయులు అరెస్ట్..

పేకాట రాయులు అరెస్ట్..

- Advertisement -

విశాలాంధ్ర-తాడిపత్రి: ఎనిమిది మంది పేకాట రాయులను అరెస్ట్ చేసినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ శివగంగాధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీశ్,డివిజనల్ పోలీస్ అధికారి రోహిత్ కుమార్ ఆదేశాల మేరకు రాబడిన సమాచారంతో తాడిపత్రి రూరల్ అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె.ధరణి బాబు సిబ్బందితో కలిసి మండల పరిధిలోని చుక్కలూరు గ్రానైట్ ఫ్యాక్టరిల దగ్గర పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 31వేల రూపాయల నగదు, 52 పేకాట ముక్కలను స్వాదీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు. తాడిపత్రి మండలంలోని, చుట్టుప్రక్కల గ్రామాలలో గాని ఎవరైనా గ్యాంబ్లింగ్ నిర్వహించిన, జూదం ఆడిన అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనబడునని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారంను డయల్ 100 కు గాని, తాడిపత్రి రూరల్ పోలీసులకు గాని తెలపాలని ప్రజలకు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు