విశాలాంధ్ర బొమ్మనహల్.. మండలంలోని గోవిందవాడ గ్రామంలో బీసీ కాలనీ ప్రజలు ఎటు వెళ్లాలన్నా.. బురద నీటిలో ప్రయాణం తప్పడం లేదు. ఇటీవల వర్షాలు కురవడంతో దారుల్లో నిలిచిన మురుగు నీటిలో నుండి ఇళ్లలోకి వెళ్లే దుస్థితి ఏర్పడిందని కాలనీవాసులు వాపోయారు. ఆ మురుగు నీటిలో దోమల ఉద్ధృతి పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడిచినా కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడంతో బురద తోనే నిత్యం ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ఇంట్లోకి వెళ్లాలంటే బుదదలో వెళ్లాలని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నెలలుగా సమస్య పట్టి పీడిస్తుందన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే అధికారులు సీసీ రోడ్లు వేయించాలని కోరుతున్నారు కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.


