అడ్మినిస్ట్రేటివ్ అధికారిని కతిజు న్ కుప్రా
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై సమావేశమును అడ్మినిస్ట్రేటివ్ అధికారి కతిజున్ కుప్రా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు
ఖతిజున్ ఖుబ్రా మాట్లాడుతూ సమాజంలో భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ వలన ఆడ శిశువుల జననాల రేటు గణనీయంగా పడిపోతున్నదని తెలిపారు. దీనిని నివారించుటకు ప్రభుత్వం వారు పీసీ.. పి ఎన్ డి టి యాక్ట్ 1994 ని తీసుకొనిరావడం జరిగినదని తెలిపారు. ఈ చట్టం మేరకు లింగ నిర్ధారణ నేరమని , డివిజన్ పరిధిలో లింగ నిర్ధారణ చేసినట్లు ఫిర్యాదులు అందితే అలా లింగ నిర్ధారణ చేసిన సదరు ఆసుపత్రులు/స్కానింగ్ సెంటర్ల పై వెంటనే కఠిన చర్యలు తీసుకోనబడునని వారు హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయమై ఆకస్మిక తనిఖీలు నిర్వహించవలెనని తెలిపారు. ఈ సమావేశం లొ డివిజన్ పరిధిలో గల వైద్య శాఖ అధికారులు, ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు , తహశీల్దార్లు , రోటరీ క్లబ్ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం పై సమావేశం..
- Advertisement -
RELATED ARTICLES


