Tuesday, November 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినల్ల బ్యాడ్జీలతో నిరసన

నల్ల బ్యాడ్జీలతో నిరసన

- Advertisement -

ఆర్డిటి కి వెంటనే ఎఫ్ సి ఆర్ ఏ మంజూరు చేయాలని డిమాండ్

విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద సేవ్ ఆర్డిటి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.నల్ల బ్యాడ్జీలు ధరించి, రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సంస్థకు వెంటనే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనుమతి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సేవ్ ఆర్డిటి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ ఆదిశేషులు , జిల్లా కో కన్వీనర్ సాకే వినయ్ సభ్యులు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఆర్.డి.టి. సేవలు నిలిచిపోవడం అనేది ప్రజల పట్ల తీవ్రమైన అన్యాయం అవుతుంది అని తెలిపారు. గాంధీ ఆత్మకు నిజమైన నివాళి అంటే సేవా సంస్థలను పరిరక్షించడం అని తెలిపారు.కాబట్టి కేంద్ర ప్రభుత్వం, గృహ మంత్రిత్వ శాఖ తక్షణ చర్యలు తీసుకుని ఆర్.డి.టి.కి అనుమతి మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవ్ ఆర్డిటి కమిటీ సభ్యులు మంజుల నరేంద్ర, మల్లెపూగుల మల్లి శ్రీనివాసులు, సాకే సోము, హరి కృష్ణ రెడ్డి, బాషా,రాజశేఖర్, రేగాటిపల్లి నరేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఏనుముల పెద్దన్న, యుగంధర్,ఇతర పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు