విశాలాంధ్ర-కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : మండల అభివృద్ధికి కృషి చేస్తా అని పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వలన రైతులు వ్యవసాయ నిమిత్తం కొనుగోలు చేసే వ్యవసాయ పరికరాలు తక్కువ ధరలకే తమకు అందుబాటులోకి వస్తున్నాయని రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నియోజకవర్గంలో కొయ్యలగూడెం మండలంలో అత్యధిక మెజారిటీ ఓట్లు వేసి తనను శాసన సభ్యులుగా గెలిపించినందుకు ఇచ్చిన హామీలైన, కొయ్యలగూడెం లో ఫైర్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, పోలీస్ స్టేషన్ చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడిఏ బుజ్జిబాబు, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.


