విశాలాంధ్ర- ధర్మవరం; ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అని తగ్గింపు చేయడం పట్ల, ఇందులో భాగంగా మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తో పాటు టిడిపి ఇన్చార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో 25వ వార్డులో జిఎస్టి తగ్గింపు పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు ఎలక్ట్రికల్ వస్తువులు డాక్టర్ పరికరాలపై ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిందని, కొనుగోలు చేసేందుకు సులభతరం అవుతుందని తెలిపారు. అంతేకాకుండా జిఎస్టి శాతం ప్రకారమే వ్యాపారస్తులు అమ్మకాలు జరపాలని తెలిపారు. ప్రభుత్వం జీఎస్టీతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. దీనివల్ల చిన్న చిన్న వ్యాపారస్తులకు ఎంతో లాభం చేకూరుతుందని తెలిపారు. వస్తువులు కూడా చౌకగా లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిఓ విజయభాస్కర్, టిడిపి నాయకులు చీమల రామాంజి తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మున్సిపల్ అధికారులు
- Advertisement -
RELATED ARTICLES


