విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల ఏడవ తేదీ అనంతపురం అశోక్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్.జి.ఎఫ్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలలో, ధర్మవరం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి ఎస్.జి.ఎఫ్ టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్ నాగేంద్ర, నాగరాజు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థు లలో అండర్ 14: మధుసూదన్, అండర్ 17: పవన్ కుమార్, అండర్ 19: అశోక్ బాబు, అభినాష్ ఎంపిక కావడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థుల ఎంపికపై ప్రధానోపాధ్యాయులు రామకృష్ణప్ప , పీ.డి. నాగేంద్ర , నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, బోధ నేతర సిబ్బంది, పాఠశాల కమిటీ ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలో కూడా ఈ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చేసి పాఠశాలకు గౌరవం తేవాలని తెలిపారు.
రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ టేబుల్ టెన్నిస్ పోటీలకు విద్యార్థులు నలుగురు ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


