Homeజిల్లాలుఅనంతపురంనియామకాలలో విజయభేరీ మోగించిన అనంతలక్ష్మి విద్యార్థులు

నియామకాలలో విజయభేరీ మోగించిన అనంతలక్ష్మి విద్యార్థులు

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు బహుళ జాతి కంపెనీలు ప్రాంగణ నియామకాలలో 175 మంది ఉద్యోగాలు కైవసం చేసుకుని విజయభేరిని మోగించాలని కళాశాల చైర్మన్, డైరెక్టర్ రమేష్ నాయుడు పేర్కొన్నారు. టీవీఎస్ బ్రేక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మిట్ శుభ ఇండియా ప్రైవేట్, సాయి ఎనర్జీ, మోడీప్రో ఇంజనీరింగ్ సొల్యూషన్ కంపెనీ నిర్వహించిన నియామకాలకు 400 మంది విద్యార్థులు హెచ్ఆర్, రాత పరీక్ష, బృందం చర్చలు, హెచ్ ఆర్ రౌండు ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపికైన 175 మంది విద్యార్థులను ట్రైనీ ఇంజనీర్లుగా మూడు లక్షల వార్షిక వేతనం అందుకొని ఉన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్, డైరెక్టర్, ప్రిన్సిపల్ కొట్టాల శ్రీనివాసులు, నైపుణ్య అభివృద్ధి నిపుణుడు ఎం సురేందర్ నాయుడు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు