Homeవిశ్లేషణఇది మాయాలోకం…!

ఇది మాయాలోకం…!

- Advertisement -

రా బావ ఏంటి ఈరోజు ఊహల్లో ఊగుతూ ఈల వేసుకుంటూ వస్తున్నావు. అది సరేగాని నేనింకా 23 సంవత్సరాలు బతకాలని ఉంది. నా కొడుకు, మనవళ్లు ఆనందం చూసినాకెే మరణించాలని ఉంది. గతంలో ఇంద్ర లోకంలో అమృతం తాగి బతకాలనుకున్నంత కాలం బతికేవారట. ప్రస్తుతం ప్రభుత్వం అమ్మే మద్యం తాగి మధ్య వయస్కులే చనిపోతున్నారు. నాకు మాత్రం 2047 వరకు ఎంత ఖర్చు అయినా సరెే బతికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా మన రాష్ట్రం వెలిగే దశ చూడాలని ఉంది. అది సరేనయ్యా 2047 ఏం చూడాలని ఉంది. భలే వాడివి బావ ఒక సారా రెండు సార్లా అనేక సార్లు మన ముఖ్యమంత్రి బాబుగారు చెబుతున్న మాట వినలేదా. ప్రపంచంలోని నంబరువన్‌గా అంటే అగ్ర దేశాలైన అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, జపాను వాళ్లు కూడా మన రాష్ట్రానికి క్యూ కడతారు. అప్పుడు నీకు చోటుండదు. ఏదో అనుకుని అనవసరంగా భ్రమలో పడి ఊహల్లో ఊయల వూగడం మాని కాస్త నేల మీద నిలబడి స్థిమితంగా నిలబడి ఆలోచించాలి. అయితే బాబుగారి మాట అటకెక్కడమేనా? అయినా నీ భ్రమగాని చెప్పినవి, చేసిన వాగ్దానాలు గాలికి వదలటమేగాని అమలు చేసిందెక్కడ. కాని నీవే కాదు ఈ మాయాలోకం తీరు తెలియని వారంతా నీలాగ లొట్టలేసుకుని చివరకు ఉసూరుమంటూ ఒక వేడి నిట్టూర్పు వదులుతుంటే మధ్య తరగతి వారు ఏమో ఇంకో పదేళ్లు చూద్దాం అనుకుంటే మేధావులు వారిని చూసి జాలి పడుతున్నారు. అభివృద్ధి అనే మాట గాలి కొదిలి అప్పులు పెంచి మనకు రుణ భారం పెంచుతున్నారు. నిజమేనయ్యా అసలు ఏ పార్టీ మాట నమ్మాలో తెలియడం లేదు.
అందుకేనయ్యా మనం ఇవన్నీ ఆలోచించకుండా కులమతాల చిచ్చులో నలిగిపోయేలాగా తెలివితేటలతో రాజకీయ నాయకులు వాటిని పెంచి పోషిస్తున్నారు. కులానికో నాయకుడికి పదవి కట్టపెట్టి కుల పోషకులుగా వారిని ప్రభుత్వం పోషించి రెచ్చగొడుతోంది. ఆ మాయలోపడి వివిధ నాయకులు వారి కులాలకు న్యాయం చేయడానికి కుల గణన అవసరమంటున్నారు. ఒకవేళ కుల గణన తరువాతనైనా ఎక్కువ ప్రజలున్న కులం వారికి దామాషా ప్రకారం ఉద్యోగాలు, రాజకీయ పదవులు కోరుకుంటారు కదా. అప్పుడు తక్కువ జనాభా ఉన్న కులాల సంగతేంటి.
ప్రాథమికంగా ప్రతి మనిషికి అవసరమైన విద్య, వైద్యం ప్రతి ఒక్కరికి అందించవలసిన నైతిక బాధ్యత ప్రభుత్వానిది. అది మరచి పి`4 కు అప్పచెప్పి చేతులు దులుపుకోవడం మహా తప్పిదంగా భావించాలి. అమరావతి నిర్మాణంపైనున్న శ్రద్ధ విద్య, వైద్యంపై లేకపోవడం దురదృష్టంగా భావించాలి. ఒకపక్క జనాభా పెరగాలి. పిల్లలను ఎక్కువ మందిని కనమని బాబుగారు పదేపదే చెబుతూ వైద్యం అందించకుండా ఉన్నవారు పోతుంటే చోద్యం చూడటం భావ్యం కాదు. నేను చెప్పింది మీ కోసం మా కోసం కాదన్నట్లు నాయకులు మాత్రం కుటుంబ నియంత్రణ పాటిస్తూ ప్రజలందర్ని పిల్లల్ని కనమని హితవు చెప్పటం చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒకపక్క అప్పులు పెంచుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందనే ప్రకటన వింతగా ఉంది. మనిషికి కుటుంబ నిర్వహణ ఎంతో ప్రభుత్వానికి రాష్ట్ర నిర్వహణ అంతే. కుటుంబ యజమాని ముందు కూడు, గూడు గురించి ఆలోచిస్తాడు. పొట్ట నిండిన తరువాత ఇల్లు గురించి ఆలోచిస్తాడు. తన ఆదాయాన్ని బట్టి మూడు గదుల ఇల్లు నిర్మించుకుని ఆ తరువాత రెండు అంతస్థులకు పెంచుకుంటాడు. ఒకేసారి ఏడు అంతస్థుల ఇంటి గురించి ఆలోచించడు. మనిషికి ఇల్లు ఎంతో ప్రభుత్వానికి రాష్ట్రం అంతే. కాని మన ముఖ్యమంత్రి మాత్రం ప్రాథమికంగా మనిషి అవసరాలు పక్కన పెట్టి ప్రపంచంలోనే ఎక్కడా లేని రాజధాని నిర్మాణం చేస్తానంటున్నారు. పోలవరం చూపించడానికి ఫ్రీ బస్సులు నడిపారు. ఇప్పుడు ఫ్రీ బస్సుల్లో రాష్ట్రమంతా తిరగమని సోదరీమణులకు వరమిచ్చారు. ఆనాడు పోలవరం చూపమని, ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇవ్వమని ఎవ్వరూ అడగలేదు. అడగకుండా ఇవ్వడమే గొప్పగా భావించాలి. కాని అడిగేవి ఏవి ఇవ్వడం లేదు. టూరిజం ద్వారా సంపాదించే ఆలోచన ఉంది. మంచిదే కాని అప్పుడు ఓట్ల కోసం ఫ్రీ అనకుండా ఉండాలి కదా. అటు జగన్‌ ఇటు బాబు ఎవరడిగారని సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్సులు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు.
ప్రతి మనిషికి చేసుకోవడానికి పని చూపితే చాలు. పని చేసుకుని సంపాదించుకుని ఎవరి బతుకు వారు హాయిగా బతకగలరు. అంతేగాని ఓట్ల కోసం అడగక పోయినా ఈ వాగ్ధానాలతో అప్పులు పెంచి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడం ధర్మం కాదు. కాస్త నేల మీద నిలబడి ఆలోచిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎవరూ అడగని ఉచితాలకు స్వస్తి పలికి ప్రతి వ్యక్తికి విద్య, వైద్యం ఉచితంగా ఇచ్చి ప్రతి మనిషికి పని చూపిస్తే అంతకంటే ప్రభుత్వ పరంగా ఏమీ ఆశించరు. ఇప్పటికైనా అప్పులు పెంచకుండా ఉన్నంతలో ముఖ్య అవసరాలు తీర్చితే ప్రభుత్వాన్ని ఇంకేమి అడగరు. అంతేగాని మనిషిని ఊహల్లోకి నెట్టకుండా ఉంటే మంచిది.
సెల్‌: 9885569394

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు