Homeఆంధ్రప్రదేశ్అసెంబ్లీ ఓట్లను పవన్ కళ్యాణ్ , పార్లమెంట్ ఓట్లను మోదీ దొంగిలించారు

అసెంబ్లీ ఓట్లను పవన్ కళ్యాణ్ , పార్లమెంట్ ఓట్లను మోదీ దొంగిలించారు

- Advertisement -

ఈ వి ఎమ్ లను మాయ చేయటం మోదీ సర్కార్ కే సాధ్యం .

ఆంధ్రులను ఏలా మోసం చేయాలో తక్కువ సమయంలో అనుభవం సంపాదించిన పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వున్న చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ లో లేకపోయింది ..

….. మేడా శ్రీనివాస్
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : నిజాయితీగా ఎన్నికల్లో గెలిచాం అని ఋజువు చేసుకోగల సత్తా పవన్ కళ్యాణ్ కు వుందా ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు.. మోదీ సర్కార్ గెలుపు వెనుక అంతా ఒక రాజకోట రహస్యం దాగివుంది . ఈ వి ఎమ్,ల మాయా జాలం తోనే మూడు సార్లు మోదీ ప్రధానిగా గెలిచి కార్పొరేట్ లకు , ఆర్ధిక నేరగాళ్లకు ఊడిగం చేసారు . దేశ ఆర్ధిక స్థితిని హీనస్థితికి తీసుకెళ్లారు . మోదీ ప్రవేశపెట్టిన అన్ని పథకాల వెనుక ఒక రకమైన మాయాజాలం పొదిగి వుంది. అంతర్ జాతీయ కార్పొరేట్ మాఫియా తో కుట్ర పన్ని భారతదేశంలో ప్రజల ఓట్లను మోదీ దొంగిలించారు . ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి సమాజాన్ని హంపసయ్యపై పడుకోబెట్టారు . నేరగాళ్ళను ప్రోత్సహించి పార్లమెంట్ కు మకిలి పట్టించారు . మోదీ గెలుపు ఒక రహస్యం . మోదీ విద్యార్హత ఒక రహస్యం . మోదీ పాలన ఒక అబద్దం . మోదీ సొంత ఈ వి ఎమ్ లకు భయపడి నరేంద్ర మోదీ కూటమికి జై కొట్టి దొంగలందరు పాలనను శాసిస్తున్నారు . చెప్పుకోవటానికి మాత్రమే భారతదేశంలో ప్రజాస్వామ్యం . అమలు కాబడేది మాత్రం తాలిభన్ లను మించిన పాలన అమలవుతుంది . మోదీ పాలనను సాగనంపితేనే భారత్ లో పూర్తి స్వామిక ప్రజాస్వామ్యం ప్రజలు అనుభవిస్తారని ఆయన నేరుగా తెలిపారు . ఆంధ్రప్రదేశ్ లో సైతం బారిగా ఈ వి ఎమ్ మోసాలు జరిగాయి అనటంలో సందేహం లేదు . పోలైన ఓట్లకు , లెక్కించిన ఓట్లకు సంబంధమే లేకపోయింది . అనేక గందరగోళ పరిస్థితుల్లో 2024 సాధారణ ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరిగాయని, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి . కూటమితో కలిసి ఆంధ్రప్రదేశ్ లో పోటి చేసిన పవన్ కళ్యాణ్ 21 అసెంబ్లీ స్థానాల్లోను గెలవటం అత్యంత ఆశ్చర్య కరమైనప్పటికి పాలనా వైఫల్యం అయినప్పటికి నేర పరిశోదన బలహీనతతో నేరాలను కట్టడి చేయగల సామర్ధ్యం రోజు రోజుకు నిర్వీర్యం అయిపోతుంది . ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఆత్మ విమర్శ చేసుకుంటే అనుభవిస్తున్న అధికారం అధికారమేనా ! నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ తన గెలుపు ఎలా సాధ్యం అయ్యిందో గ్రహించలేరా ! పిఠాపురం నియోజకవర్గం మొత్తంగా పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకించి నోటికొచ్చిన బండ బూతులు శాపనార్దాలుతో వ్యతిరేకించినా వేల ఓట్లు మెజార్టీ రావటం ప్రపంచ వింతల్లో ఒకటిగా ఉంటుంది . ఇన్వెస్టిగేషన్ చేయగల దమ్మున్న ఏజెన్సీ మోదీ సర్కార్ పాలనలో వుంటే ఎన్నో ఆసక్తికర సాంకేతిక నేరాలు భహిర్గతం అవుతాయని ఆయన పేర్కొన్నారు . ఎన్నడు కని విని ఎరగని విధంగా 2024 ఎన్నికల నిర్వహణ బరి తెగింపుగా జరిగాయి . కేంద్ర ఎన్నికల సంఘం ఇతరుల నుండి వచ్చే పిర్యాదులను అస్సలు పట్టించుకో లేకుండా తీవ్రమైన అధికార దుర్వినియోగం చర్యలకు పాల్పడింది . ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టి పూర్తిగా చట్టాలను, నిబంధనలను, మోసం చేసి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ను మాయ చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది . 2024 సాధారణ ఎన్నికల్లో కామన్ సింబల్ కోసం ఆంధ్రప్రదేశ్ నుండి ముందుగా దరఖాస్తు చేసుకున్న ఏకైక పార్టి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ . ఎన్నికల సంఘం అధికార దుర్వినియోగంతో మా దరఖాస్తు ను బుట్టదాఖలు చేసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టి దరఖాస్తు ను పైన పెట్టించి గాజుగ్లాస్ గుర్తును అడ్డగోలుగా పొంది నప్పటికి న్యాయస్థానం ద్వారా మేము కూడా గాజు గ్లాస్ గుర్తు తోనే పోటి చేయటం జరిగింది . అయినప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టికి ఎన్నికల సంఘం మేలు చేయటానికి అధికార దుర్వినియోగంతో ఎన్నికల పూర్తి షెడ్యూల్ ముగిసిన తరువాత గాజుగ్లాస్ గుర్తుతో పార్లమెంట్ స్థానంలో ప్రచారంలో వున్నటు వంటి మా పార్టి గుర్తును చట్ట విరుద్ధంగా రద్దు చేసారు . ఇన్ని అక్రమాల్లో గెలిచాము అంటు ప్రగల్బాలు పలుకుతున్న జనసేన కు దక్కిన గుర్తింపు , గెలుపు ఎంత వరకు నిజమో చర్చకు సిద్దపడగలరా ! అని సూటిగా ప్రశ్నించారు . అతి తక్కువ రాజకీయ అనుభవంలో ఆంధ్రులను ఎలా మోసం చేయాలో మెళుకువలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉన్నటువంటి కమ్మిట్మెంర్ పవన్ కళ్యాణ్ లో లేదనేది నిజం కాదా ! పవన్ కళ్యాణ్ స్వప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను దోచుకుంటున్న వారికి వెన్ను దన్నుగా నిలబడటం బాదాకరం . మోదీ పార్లమెంట్ ఓటును దొంగిలించారు . ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అసెంబ్లీ ఓటును దొంగిలించారు . ప్రజల హృదయాలను గెలవలేని పవన్ కళ్యాణ్ అడ్డ దారిలో అన్యాయంగా గెలుపుని స్వయం ప్రకటన చేసుకున్నారు . విభజన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నష్ట పోవటానికి పవన్ కళ్యాణ్ కారణం కాదా ! పవన్ కళ్యాణ్ ఆవేసిత ఉపన్యాసాలు చూసి కొంతమంది ఏదో మంచి చేస్తాడు అని నమ్మారు . మోదీకి సాగిల పడి రాష్ట్ర ప్రతిష్టను , అభివృద్ధిని, యువత భవిష్యత్ ను తాకట్టు పెడతారని ఊహించలేకపోయారు . పవన్ కళ్యాణ్ రాజకీయ నిజ స్వరూపం మొత్తం బట్ట బయిలు అయినప్పటికి నేటికి కొంతమంది అతగాడిని అభిమానిస్తుండటం ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం కాదా ! పవన్ కళ్యాణ్ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణం నేడు ఆయన వద్దనే వుంది . ఏ బలహీనతలు మిమ్ములను వెంటాడుతున్నాయో మాకు తెలవదు . ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దృష్ట్యా , మీ ప్రతిష్ట మరింత దిగజారకముందే మీరు రాజకీయాల నుండి నిష్క్రమించటం మంచిదని , లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే పవన్ కళ్యాణ్ ను భహిష్కరించే రోజులు దగ్గరలోనే వున్నాయని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు . సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు . ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి, లంక దుర్గా ప్రసాద్ , సిమ్మా దుర్గారావు , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , కారుమూరి యుగంధర్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , మెడిచర్ల శ్రీనివాసరావు , వల్లి శ్రీనివాసరావు , వాడపల్లి జ్యోతిష్ , కొల్లి సత్యనారాయణ, కాకర ప్రసాద్ , యర్రా బాల మురళి కృష్ణ , అడపా శేషగిరి, చల్లా సాంబశివరావు, చల్లా వంశీ , కందివలస హైమావతి , ఊరకుల నాగమణి తదితరులు పాల్గొనియున్నారు ..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు