Homeఆంధ్రప్రదేశ్దిగులుగా దీపావళి వ్యాపారులు

దిగులుగా దీపావళి వ్యాపారులు

- Advertisement -

విశాలాంధ్ర- తాళ్లపూడి : నిమిషానికో రకంగా వర్షం, మబ్బులుతో విచిత్రంగా ఉన్న  వాతావరణం ఓ ప్రక్క,   కఠిన తరంగా మారిన  అధికారుల నిబంధనలు మరో ప్రక్క, ఈ రెంటి మధ్య ఈ ఏడాది దీపావళి బాణసంచా దుకాణాల నిర్వాహకులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దీపావళి రెండు రోజులు ముందుగా ఏర్పాటు చేసుకునే వ్యాపారులు (ఆదివారం) ఓ రోజు మాత్రమే ముందుగా షాప్లు ఏర్పాటు చేశారు. దానికి తగ్గట్టు రెండురోజులు గా మబ్బులు, ఓ మాదిరి వర్షం నెలకొంది. ఓ పది సంవత్స్రాలుగా  వ్యాపారాలు చేసే ప్రదేశాన్ని  పిర్యాదు లు కారణం గా  మార్చి వేరే ప్లేస్ లో షాపులు ఏర్పాటు చేశారు. పలు చోట్ల జరిగిన ప్రమాద సంఘటనలు దృష్ట్యా ఈ దఫా తాళ్లపూడి లో అధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. వాతావరణం కారణంగా ఆదివారం షొప్ లు వెల్వెలబోయాయి. తాళ్లపూడి మండలం లో రెండు చోట్ల అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తన్నారని పోలీస్ లు  దాడులు చేసి     కేసులు పెట్టారు. తాళ్లపూడి మండలం లో  మొత్తం    ఎనిమిది మంది బాణసంచా దుకాణాల కోసం అనుమతులు పొందారని ఎస్సై రామకృష్ణ తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు