Homeఆంధ్రప్రదేశ్వైద్య ఖర్చులకు మానవత సహకారం

వైద్య ఖర్చులకు మానవత సహకారం

- Advertisement -

విశాలాంధ్ర – తాళ్లపూడి : మానవత తాళ్లపూడి మండల శాఖ అద్వర్యం లోను, తాళ్లపూడి యువ గళం టీమ్ అద్వర్యం లో  ఓ వ్యక్తి కి  వైద్య ఖర్చులు నిమిత్తం  పదహారు వేల రూపాయల ఆర్ధిక సహకారం బాధిత కుటుంబానికి అందచేశారు. గజ్జరం గ్రామానికి చెందిన పైడిమెట్ట స్కీమ్ సిబ్బంది అవుడు సూర్యచంద్రం  పక్షవాతం తో బాధపడుతున్న నేపధ్యం లో మానవత తరపున 6వేలు  రూపాయలు అందించినట్లు తాళ్లపూడి మానవత శాఖ అధ్యక్షులు ఎలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు. కాగా  తాళ్లపూడి మండల యువగళం టీమ్  కొర్లపాటి అద్వర్యం లో 10 వేల రూపాయలు అందచేశారు. ఈ కార్య క్రమం లో పాల్గొన్న పైడిమెట్ట స్కీమ్ అధ్యక్షులు ముళ్ళపూడి రామచంద్రం తన తరుపున ఉచితం గా మందులు  అందిస్తామని తెలిపారు. యువగళం టీమ్ ఎం.ఎస్., మద్దుకురి అబ్బులు, పెదవేగి బాలాజీ, మద్దిపాటి శ్రీను, కాకర్ల ఆదిత్య, రాయంకుల దుర్గయ్యపాల్గొన్నారు. ఎన్నో సేవలు అందిస్తున్న మానవత సభ్యులను ఈ సందర్భన్గా అభినందించారు. అభినందన కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ గండి రాంబాబు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు