విశాలాంధ్ర – తూర్పుగోదావరి : జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా వసతి గృహాలలో ఉండే పిల్లల విషయంలో అన్ని వసతి గృహాల వార్డెన్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించరాదు అని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహాల నుండి పిల్లలను పంపేముందు, పిల్లల సంరక్షణలో భద్రతను గరిష్టంగా నిబంధిస్తూ, బంధువుల వివరాలు, తగిన ఆధారాలు ముందుగా నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే వారితో పంపవలసినది అని స్పష్టం చేశారు. ఇటీవల నగరంలో చోటు చేసుకున్న సంఘటన నేపథ్యంలో, హాస్టల్ వార్డెన్‌కు షో కాజ్ నోటీసు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ సంఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో సమగ్ర విచారణ చేపట్టడం జరుగుతోందని కూడా వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో, వసతి గృహాల్లో నిర్లక్ష్యం గమనించబడక పోయినప్పటికీ, ఆడపిల్లలు, వసతి గృహాల్లో ఉండే పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్, ఈ హెచ్చరికల ద్వారా, వసతి గృహాల వార్డెన్లు పూర్తి అప్రమత్తత, జాగ్రత్త మరియు బాధ్యతా దృక్పథంతో విధులు నిర్వహించాలి అని ఆదేశించారు. ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం ప్రజలకు స్పష్టంగా అర్థం అయ్యే విధంగా, పిల్లల భద్రతను మరింత బలపరచడం అని తెలిపారు.
వసతి గృహాలలో పిల్లల సంరక్షణపై జిల్లా కలెక్టర్ హెచ్చరిక
- Advertisement -
RELATED ARTICLES


