వైయస్సార్ ఎస్సి, ఎస్టి సెల్ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలో అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు చర్యలు గైకొనాలని వైఎస్ఆర్సిపి ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు చౌడప్ప, దేవరకొండ రమేష్ కునుతురు గోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో డిఏఓ కతిజున్ కుప్రకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భారత దేశంలోనే మొట్టమొదటి న్యాయశాఖ మాత్యులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ భవనం ఏర్పాటు ప్రభుత్వమే చేయాలని, వీలైతే ప్రభుత్వ స్థలమును కేటాయించి భవన నిర్మాణమును ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. దీనివలన ఎస్సీ ఎస్టీలకు వివాహాది శుభకార్యాల కోసం తదితర కార్యక్రమాల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. భవన నిర్మాణం పూర్తి అయిన తర్వాత భవనానికి అంబేద్కర్ భవన్ అని నామకరణం చేస్తామని, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. లేనియెడల వైయస్సార్సీపి పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలందరూ ఏకమై ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుజ్జల బోమ్మన్న ,సాకే వెంకటేష్, రామాంజనేయులు, మల్లెల పెద్దన్న, పోతల కుల్లాయప్ప, ఆంజనేయులు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు చర్యలు గైకొనండి..
RELATED ARTICLES