Homeఆంధ్రప్రదేశ్అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

మంత తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

 మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి 

 విశాలాంధ్ర – అనపర్తి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారునున్న నేపథ్యంలో  నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్త o గా  ఉండాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి  సూచించారు. శనివారం ఎంపీపీ అనుసూరి బుజ్జి అధ్యక్షతన జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంతా తుఫాన్  మన రాష్ట్రంలో అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు, విద్యుత్తు, రెవెన్యూ సంబంధిత శాఖల అధికారులుతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారుల  రివ్యూ   చేసారు. ఎంపీపీ అనసూరి బుజ్జి జీఎస్టీ పై  మధ్యతరగతి పేద ప్రజలకు జరుగుతున్న మేలులుపై ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలియజేసే తీర్మానం ప్రవేశపెట్టరు. రెండోదిగా రామవరం ఎంపిటిసి గొలుగూరి గౌతమి అనపర్తి నియోజకవర్గం చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గాల ప్రజల ఎన్నో ఏండ్ల కళ జన్మభూమి హాల్ట్ తో తీరిందని ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేసారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా హర్షద్వానలు తెలియజేస్తూ తీర్మానించారు. ఎంపీడీవో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం విషయంలో అలసత్వం వహించరాదని ఎప్పటికప్పుడు రోడ్లు, మురికి కాలువలు శుభ్రం చేయాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అనిల్ , మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు జుత్తుక సూర్య కుమారి, వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు