శ్రీ గంగమ్మ తల్లి ఆలయానికి ఉప సర్పంచ్ రాంజీ బూరి విరాళం.
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, బుర్రిలంక గ్రామంలో గల శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కడియపులంక ఉప సర్పంచ్ పాఠంశెట్టి వెంకట రామారావు (రాంజీ) 1,00,116 రూపాయలు బూరి విరాళాన్ని అందించారు. శనివారం బుర్రిలంక గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే బుచ్చియ్య చౌదరి గంగమ్మ తల్లి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా ఆలయ కమిటీకి ఈ విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, చిరు సేవా సమితి అధ్యక్షులు గడ్డం శివ, గట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


