Homeజిల్లాలువిజయనగరంతుఫాన్ ప్రభావం పరిశీలనలో మాజీ మంత్రి మురళీమోహన్

తుఫాన్ ప్రభావం పరిశీలనలో మాజీ మంత్రి మురళీమోహన్

- Advertisement -

విశాలాంధ్ర -రాజాం (విజయనగరం జిల్లా) : తుఫాన్ ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మంగళవారం రాజాం నియోజకవర్గంలోని పలు గ్రామాలను పర్యటించారు.

రాజాం మండలం ఓమ్మి, లక్ష్మీపురం గ్రామాల్లో వరిపంటలు పూర్తిగా నీటమునిగిపోయి నేలకొరగడం, పంటలు దెబ్బతినడం ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ, “అన్నదాతలు ఆందోళన చెందవద్దు. పంట నష్టాల అంచనాలు వేగంగా పూర్తి చేసి, ప్రభుత్వం ద్వారా సకాలంలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.

అలాగే అగ్రికల్చర్ అధికారులను ఉద్దేశించి, పంటల నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. పర్యటనలో స్థానిక నాయకులు, రైతు సంఘ ప్రతినిధులు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఆయనతో పాటు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు