విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మహా పుణ్యక్షేత్రం పీఠాదిపతులుగా శ్రీ శ్రీ వెంకటాద్రి స్వాములను నియమించాలని మంగళవారం కమీషనర్ ఆజాద్ కు విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు నరసింహ ఆచారి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కడప జిల్లా కందిమల్లయ పల్లె శ్రీ బ్రహ్మం గారి మఠము నందు నాలుగు సంవత్సరముల నుండి పీఠాధిపతి విషయం నియమించలేదన్నారు. దేవాదాయశాఖ ఆధీనములో మహా పుణ్యక్షేత్రంలో జరుగు కార్యక్రమాలు అన్ని దేవాదాయశాఖ ఆధీనంలో జరిగేవని తెలిపారు. రాష్ట్రధార్మిక పరిషత్ రాష్ట్రవిశ్వహిందూ పరిషత్,ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ సమక్షంలో పీఠాధిపతి నియామకం ఆంధ్ర ప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘాల వారు తమ అభిప్రాయాలను వినతి పత్రముద్వారా శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మటములో సమర్పించాలని తెలపాలన్నారు . విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు వీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపతి కీర్తిశేషులుశ్రీ శ్రీ వెంకటేశ్వర స్వాముల ప్రథమ పుత్రుడు శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఎనిమిదవ తరము పీఠాధిపతులుగా శ్రీ శ్రీ వెంకటాద్రి స్వాములను నియమించాలని నిర్ణయించి సంఘము కమిటీ సభ్యుల సంతకాలు సేకరించి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మహా పుణ్యక్షేత్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ కు వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు గువ్వలదొడ్డి శ్రీనివాసాచారి గారు, గోల్డ్ స్మిత్ రవి, లక్ష్మీనారాయణ ఆచారి, లోకేష్ ఆచారి మంత్రాలయం ప్రహల్లాద చారి, తదితరులు పాల్గొన్నారు.
పీఠాధిపతులుగా వెంకటాద్రి స్వాములను నియమించాలి
- Advertisement -


