Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమానవతా సంస్థ సేవలను మరింత విస్తృత పరుస్తాం

మానవతా సంస్థ సేవలను మరింత విస్తృత పరుస్తాం

- Advertisement -

అధ్యక్షుడు జగ్గా వేణుగోపాల్
విశాలాంధ్ర ధర్మవరం;; మానవతా సంస్థ సేవలను పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్కృత పరుస్తామని అధ్యక్షుడు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు కళాజ్యోతిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మానవతా సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. అనంతరం జగ్గా వేణుగోపాల్ మాట్లాడుతూ ఇప్పటికే పేద ప్రజలకు ఫ్రీజర్ బాక్స్, ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు, అనాధ శిశువులకు పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 293 మందికి వివిధ రకాలుగా సేవలు అందించడం జరిగిందన్నారు. మా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలకు దాతలు కూడా ముందుకు వస్తే విజయవంతంగా సేవలు కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ తగ్గిందని, సెల్ఫోన్ ప్రాబల్యం మరింత ఎక్కువగా ఉన్నందున, వారి భవిష్యత్తు అంధకారంగా మారిందని తెలిపారు. కుటుంబంలోని వారందరూ కూడా తమ పిల్లల పట్ల పెంపకంతో పాటు మంచి అలవాట్లు కూడా నేర్పాలని తెలిపారు. అనంతరం రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ ను మానవతా సంస్థ సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మంజునాథ్ కళాజ్యోతి కార్యదర్శి రామకృష్ణ తోపాటు మనోహర్ గుప్తా, జింక చిన్నప్ప, రవి, చంద్ర ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు