విశాలాంధ్ర ధర్మవరం;; రెవెన్యూ డివిజన్ పరిధిలోని కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన కురుగుంట గోవిందుకు గౌరవ డాక్టరేట్ ఆసియా ఇంటర్నేషనల్ సాంస్కృతిక పరిశోధన విశ్వవిద్యాలయం ద్వారా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం హోసూరు నందు డాక్టరేట్ పొందారు. గోవిందు అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమాచార హక్కు చట్టం లాంటి సేవలు చేయడంలో మంచి గుర్తింపు పొందడం వల్ల విశ్వవిద్యాలయం వారు గుర్తించి ఈ డాక్టరేట్ పట్టాను, సేల్డ్ను , మెడల్ ను అందజేశారు. అనంతరం కురుగుంట గోవిందు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు.
కురుగుంట గోవిందు కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
- Advertisement -
RELATED ARTICLES


