Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులు, నిరుద్యోగ యువతులు మత్తు వ్యసనాల బారిన పడుతున్నారు…

విద్యార్థులు, నిరుద్యోగ యువతులు మత్తు వ్యసనాల బారిన పడుతున్నారు…

- Advertisement -

ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజర్ కార్యదర్శి సంతోష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులు నిరుద్యోగ యువతలు మత్తు వ్యసనాల బారిన పడుతున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజర్ కార్యదర్శి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ యువత భవిష్యత్తు ప్రమాదంలోకి వెళుతోందని,మొదట సరదాగా మొదలయ్యే అలవాటు తర్వాత మానసిక, ఆర్థిక, సామాజిక నష్టాలకు దారి తీస్తోంది. గంజాయి, డ్రగ్స్, మద్యం వ్యసనం వల్ల చదువు మానేసే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా కొందరు నేరాలకు పాల్పడుతున్నారు తెలిపారు. ఇది మన సమాజానికి ఆందోళనకర సంకేతం అని వారి స్పష్టం చేశారు.గంజాయి నియంత్రణలో పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సాగు జరుగుతుండగా, అధికారులు పట్టి పట్టినట్టు వ్యవహరించడం సరి అయిన పద్ధతి కాదని తెలిపారు. డ్రగ్ మాఫియాలు, మధ్యవర్తులు, లాడ్జీ నిర్వాహకులు కలిసి యువతను మోసం చేస్తున్నారు అని, స్థానిక స్థాయిలో లాడ్జీల్లో మత్తు వ్యాపారం సాగుతున్నా, అధికారుల నిర్లక్ష్యం యధావిధిగా కొనసాగుతోందా నీకు తెలిపారు.
పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పరిసరాల్లో దాదాపు 30కి పైగా లాడ్జీలు ఉన్నాయి అని,వీటిలో చాలా చోట్ల సీసీ కెమెరాలు లేవు అని, పోలీసు పర్యవేక్షణ లేదు.మద్యం, గంజాయి మత్తులో యువతలు లాడ్జీలకు వస్తున్నారు అని,చీకటి ఒప్పందాల రూపంలో అనైతిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అని తెలిపారు.పోలీసు అధికారులు కేవలం ఒకరి ఇద్దరిపై కేసులు వేసి “చర్యలు తీసుకున్నాం” అని చెప్పి మామూల్లకు మొగ్గ చూపుతున్నారు అని మండిపడ్డారు.
ఏఐవైఎఫ్ డిమాండ్లు:
గంజాయి నియంత్రణకు ప్రత్యేక రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి అని, సాగు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.
విద్యాసంస్థల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, యువతను వ్యసనాల బారినుంచి బయటకు తీయాలి అని తెలిపారు.
లాడ్జీలు, స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లపై నిరంతర తనిఖీలు జరిపి, లైసెన్స్ లేకుండా నడుస్తున్న వాటిని మూసివేయాలి అని తెలిపారు.
గంజాయి బారిన పడిన యువతకు పునరావాస కేంద్రాలు, కౌన్సెలింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి అని తెలిపారు.
పోలీసు శాఖలో నిర్లక్ష్యం చూపిన లేదా అవినీతిలో పాల్గొన్న అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
యువత భవిష్యత్తు రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి అని,మత్తు వ్యసనాల వ్యాప్తిని అరికట్టడం సమాజంలోని ప్రతీ ఒక్కరి బాధ్యత అని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు, మీడియా కలిసి అవగాహన కల్పించాలన్నారు. యువతను తప్పుదోవ పట్టించే దందాలకు వ్యతిరేకంగా సామూహిక పోరాటం అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజా, జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి కమల్ బాషా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు