Homeఆంధ్రప్రదేశ్తక్షణ చర్యలకై ఎమ్మెల్యే ముప్పిడి

తక్షణ చర్యలకై ఎమ్మెల్యే ముప్పిడి

- Advertisement -

తక్షణ చర్యలకై అప్రమత్తంగా ఉండండి*  కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి.

విశాలాంధ్ర: తాళ్లపూడి : తుఫాన్ నేపధ్యం లో  అధికారులంతా ప్రజలందరికీ తగిన సేవలు అందిస్తూ అందుబాటులో ఉండాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయన ‘మొంథా’ తుఫాన్ పై క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజల అవసరాలను, తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను కలుసు కునేందుకు, ప్రభుత్వం అందించే సేవలు సక్రమంన్గా అందుతున్నాయా లేదా అనే విషయాలను పరిశీలిం- చేందుకు  కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు తాళ్లపూడి విచ్చేసి, మండల స్థాయి  వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయన త మండలం లోని అన్నదేవరపేట గ్రామంలో ‘మొంథా’ తుఫాన్ కారణంగా పాక్షికంగా దెబ్బతిన్న పురాతన  బ్రిడ్జిని, నేలకూలిన ఇళ్ళు మరియు పరిసర ప్రాంత ప్రజలకోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన సందర్శించారు. గజ్జరం లో నీట మునిగిన చేలను సందర్శించారు. ప్రక్కిలంక లో గట్టు ప్రక్క తాత్కాలిక నివాసలుండే గంగిరెడ్డి వార్ల కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ప్రక్కిలంక పునరావాస కేంద్రం వద్ద పిల్లకు బిస్కెట్స్, పాలు ఇవ్వలేదని తెలుసుకున్న ఎమ్మెల్యే ముప్పిడి ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాసం లో ఎటువంటి లోటు రాకూడదని తహసీల్దార్ ని ఆదేశించారు. సురయ్యపేట దగ్గర కాలనీ లో  తమకు ఇళ్ళు కట్టలేదని, అది పనికిరాని స్థలం అని, కోర్ట్ లో వుందన్నారని భాదితులు చెప్పటం తో ఆగ్రహించిన ఎమ్మెల్యే, తహశీల్ధార్ ను పిలిచి వెంటనే వీరి సమస్య గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తుఫాన్ డ్యూటీ చేసే వారు బాధ్యత గా ఉండాలని, లేకుంటే మిరే భాద్యులు అని హెచ్చరించారు. అన్నదేవరపేట లో డంపింగ్ యార్డ్ వద్ద రోడ్ పైకి వచ్చిన చెత్తను చూసి ఉద్యోగులు అసలు పని చేస్తున్నారా ? లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రక్కిలంక పునరావాసం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శిస్తూ, ఎక్సఫైర్ మందులు ఉన్నాయేమో చూసు కోవలన్నారు. పెద్దెవం లో మృతి చెందిన వ్యక్తి గురించి పూర్తి వివరాలు సేకరించాలని తుఫాన్ గాలులకు వ్యక్తి మృతి చెందారని సమాచారం అందిందన్నారు. సమీక్ష పాల్గొన్న అధికారులందరికి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఈ సమయం లో విధులు పట్ల నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. ప్రక్కిలంక, అన్నదేవరపేట గ్రామాల్లో అవసరమైన విద్యుత్ స్తంభాలు వేయాలని అక్కడికక్కడే ట్రాన్స్కో ఉద్యోగులని ఆదేశించారు.  ఎక్కడా త్రాగు నీటి ఇబ్బంది రాకూడదని, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను,  నీట మునిగిన పంటల వివరాలు సేకరించాలని వ్యవసాయ ఆధికారి ని, గ్రామాల్లో ఎక్కడా చెత్త కనబడకూడదని పంచాయతీ ద్వారా ఆ పనులు అన్ని చేయించాలని  ఎంపీడీఓ ను ఆదేశించారు. పెద్దెవం లో  పడిపోయిన వరి చేలని సందర్శించారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు