Homeఆంధ్రప్రదేశ్కడియం రైతులను ఆదుకోవాలి

కడియం రైతులను ఆదుకోవాలి

- Advertisement -

తుఫాను వలన నష్టపోయిన కడియం రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

విశాలాంధ్ర – కడియం : మంగళవారం రాత్రి కురిసిన ముంథా తుఫాన్ వలన వరి పంట దెబ్బతిని, రైతులకు విపరీతమైన నష్టం వాటిల్లిందని వైసిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. నిన్న సంభవించిన ఈదురు గాలులకు కడియం ఆవలో నేలకొరిగిన వరి పంటపొలాలను బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం 1800 ఎకరాలు ఆయుకట్ట లో రైతులు వరి పండిస్తున్నారని దాదాపు 70% పంట నేలకొరిగిందని అన్నారు. పంట నష్టపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలని కోరారు. అధికార ప్రభుత్వం రైతులకు పంటభీమా చెల్లించక పోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రైతులకు ప్రభుత్వం ఉచిత పంట బీమా చెల్లించి ఉంటే ఈ రోజున వారికి 100% పంట నష్టం వచ్చివుండేది కాదని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం పంటలు పాక్షికంగా దెబ్బతిన్నా  ఉచిత పంటల భీమా ద్వారా వారికి తగిన రీతిలో పంట నష్టాలను చెల్లించామన్నారు. ఇవాళ ప్రభుత్వం పంటలకు బీమా కట్టకపోవడంతో రైతులకు భరోసా లేక అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ అనంతరం పంట దెబ్బతిన్న రైతులందరికీ నూరు శాతం పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు వైసీపీ మండల అధ్యక్షులు వైస్ సతీష్ చంద్ర స్టాలిన్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొ

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు