విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : నరేంద్రమోడీ అమెరికా అద్యక్షుడు ఏది చేపితే అది సరే అంటు అయనకు సరెండర్ అయ్యారని, దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చి ,దేశాన్ని అప్పులపాలు చేసి దేశ ప్రతిష్టను దెబ్బతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీఆర్ భవన్లో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవలన నరేంద్రమోడీ హైదరాబాద్‌కు వచ్చినపుడు కరోన సమయం వలే వర్క్ఫర్ ీVAం చేయాలని,పెట్రోల్, డీజీల్, గ్యాస్‌వాడకం తగ్గించాలని చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని, ఆర్థికంగా మనం పుంజుకున్నామని . అమెరికా చైనా దేశాల తరువాత మన దేశ ఆర్థిక వ్యవస్థ ఉందని గొప్పలు చెప్పారని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అదే గొప్పలు ప్రచారం చేశారన్నారు. కానీ 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ బాగా లేదని చెప్పడం దుర్మార్గమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నం కావడానికి ప్రదాని మోడీ ఆర్థిక విధానాలే కారణమన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి,వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.పేద వాడు రెండు పూట సరైన తిండి లభి ంచడం లేదని వీటన్నింటికి నరేంద్రమోడీ ఆర్థిక ,విదేశీ విధానమే కారణమన్నారు.మోడీ అమెరికా అధ్యక్షుని విమర్శించే దైర్యం లేదన్నారు. ఆయన ఏమి చెప్పితే అది సరే అంటున్నారన్నారు. రష్యా, ఇరాక్ నుండి ఆయిల్ కొనుగోలు చేయవద్దంటే ఆయన సరే అంటు తలూపడం దారుణమన్నారు.ఇండియా పాకిస్తాన్ యుద్దం తానే ఆపానని అమెరికా అద్యక్షుడు ట్రంప్ 62 సార్లు చెప్పిన మోడీ ఏమి మాట్లాడలేదన్నారు. మోడీ ప్రభుత్వ విదానాలకు వ్యతిరేఖిస్తూ సీపీఐ ఆద్వర్యంలో ఆగస్టు 6 నుండి 15 వరకు అన్నిదేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలో పాదయాత్ర చేసి ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. మోడీ ప్రజా వ్యతిరేఖ విధా నాలకు వ్యతిరేఖిస్తూ ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు సెప్టంబరు 22న చలో డిల్లీ నిర్వహించాలని సీపీఐ జాతీయ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి 4 కోడ్లు తీసుకురావడం , మహిళా బిల్లును2023 అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని, వీటిని పెద్దఎత్తున ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ మునెప్ప, ఎన్ లెనిన్‌బాబు, సీనియర్ నాయకులు కె జగన్నాధం, నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జీ చంద్రశేఖర్, కె శ్రీనివాసులు, నగర సహాయ కార్యదర్శులు సీ మహేష్, , శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
ట్రంప్‌కు సరేండర్ అయిన మోడీ సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
- Advertisement -
RELATED ARTICLES


