రైల్వే జిఆర్పి ఇన్చార్జ్ ధర్మవరం ఎస్ఐ వెంకటేశులు
విశాలాంధ్ర – ధర్మవరం : గత కొన్ని నెలలుగా రైల్వేలో లాప్టాప్ లు, సెల్ ఫోన్లు దొంగతనాలు జరిగేవి. ఎట్టకేలకు హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులు ఈ కేసును చేదించడం జరిగింది. ఈ సందర్భంగా డిఐజి సత్య యేసు బాబు ఆదేశాల మేరకు గుంతకల్ రైల్వే డిఎస్పి శ్రీనివాసాచారి సూచనల మేరకు, రైల్వే సీఐ అరుణ్ భాష ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే జిఆర్పి ధర్మవరం సిఐ హరుణ్ అరుణ్ భాష , హిందూపురం జి ఆర్ పి ఇన్చార్జ్ ఎస్సై బాలకృష్ణ, అనంతపురం జి ఆర్ పి, ధర్మవరం జి ఆర్ పి ఇన్చార్జ్ వెంకటేశులు మాట్లాడుతూ ఇటీవల గుంతకల్ నుండి హిందూ పురానికి వెళ్లే వివిధ రకాల రైళ్లల్లో లాప్టాప్ లు, సెల్ ఫోన్లను దొంగలించే ముద్దాయి అయినా నాసిర్ ఖాన్ అనే అతను హిందూపురం మూడవ ఫ్లాట్ ఫారం వద్ద అరెస్టు చేసి, గుంతకల్ రైల్వే కోర్టుకు తరలించడం జరిగిందని తెలిపారు. హిందూపురం జిఆర్పి, ఆర్పిఎఫ్ సిబ్బంది ఫ్లాట్ ఫారం వద్ద విధులు నిర్వర్తిస్తుండగా అనుమానం వచ్చిన నాసిర్ ఖాన్ ను, అతని వద్ద గల యూరియా సంచిని తనిఖీ చేయడం జరిగింది అని తెలిపారు. దీంతో అసలు విషయాన్నీ రాబట్టగా రైళ్లల్లో లాప్టాప్ లను సెల్ఫోన్లను దొంగలించడం జరిగిందని తమ విచారణలో గుర్తించడం జరిగిందని తెలిపారు. యూరియా సంచిలో ఉన్న వాటిని బెంగళూరుకు విక్రయించే ప్రయత్నంలో తాము అతని అదుపులో తీసుకొని గుంతకల్ రైల్వే కోర్టుకు తరలించడం జరిగిందని తెలిపారు. ముద్దాయి అయినా నాసిర్ ఖాన్ హిందూపురం వాసి అని, తదుపరి అతని ద్వారా ఆరు ల్యాప్టాప్ లు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. దీని విలువ రూ. .6, 40,000 ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఆర్పిఎఫ్ ఎస్ఐ సాయినాథ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు రాజశేఖర్ రెడ్డి ,ఎర్రి స్వామి, రామసుబ్బయ్య తోపాటు ఆర్పీఎఫ్,జి ఆర్పి సిబ్బంది పాల్గొన్నారు.
రైల్వేలో ల్యాప్టాప్, సెల్ఫోన్ దొంగ అరెస్ట్
- Advertisement -


