- Advertisement -
చిత్తూరు నగర మేయర్ అనురాధ ,ఆమె భర్త కటారి మోహన్ ల హత్య కేసులో ఐదు మంది దోషులకు చిత్తూరు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది.2015 నవంబర్ 17 తేదీన చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అప్పటి మేయర్ గా ఉన్న అనురాధను, ఆమె భర్త కటారి మోహన్ లు దారుణ హత్యకు గురయ్యారు. 10 సంవత్సరాల అనంతరం ఈ కేసులో దోషులైన కటారి మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్, వెంకటా చలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ లకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు శుక్రవారం తీర్పునిచ్చారు.


