Homeఆంధ్రప్రదేశ్రైతులకు నాయకులు అండగా నిలవాలి

రైతులకు నాయకులు అండగా నిలవాలి

- Advertisement -

రైతులను అందుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

విశాలాంధ్ర – సీతానగరం: రైతులను ఈ పంట నష్టం నుండి పూర్తిగా అందుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని రాజానగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండలంలో రఘుదేవపురం, చినకొండేపూడి గ్రామ పంచాయితీల రెవెన్యూ పరిధిలో నేలకొరిగిన, నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించి రైతులతో జరిగిన పంట నష్టం అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రైతులకు వారం రోజుల్లో చేతుకొచ్చే పంట తుఫాన్ నీటిపాలు చేసిందన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను నమోదు రెండు రోజులు సమయం ఇవ్వడం ఏమిటని ఈ రెండు రోజుల్లో పంట నమోదు సాధ్యమేనా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రైతులకు ఇన్సూరెన్స్ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేదని ప్రస్తుతం రైతులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా 40 కోట్ల రూపాయల ఇరిగేషన్ పనులను మంజూరు చేయించి టెండర్లు పిలిచే ప్రక్రియ వరకు తీసుకొస్తే దానిని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేయడం వల్ల ఎక్కువ మంది రైతులు ఈ తుఫాన్ లో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు న్యాయం జరిగే వరకు వైసిపి నాయకులు కార్యకర్తలు రైతులకు అండగా నిలిచి పంట నమోదు ప్రక్రియను పూర్తి చేయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న, సర్పంచ్లు కొండ్రపు ముత్యాలు, సత్యం రాంపండు, రైతు అధ్యక్షుడు ముదునూరి రామకృష్ణ రాజు, యువజన విభాగం చేకూరి నాని, డాక్టర్ బాబు, పిచుకుల విజయ్ కుమార్, గంటా శ్రీనివాసరావు, సురేష్ రాజు, ప్రభాస్ రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు