Homeఆంధ్రప్రదేశ్పోసి కుమార్, సత్య దంపతుల సేవలు అభినందనీయం

పోసి కుమార్, సత్య దంపతుల సేవలు అభినందనీయం

- Advertisement -

— బెన్ని బాబు.    

స్పూర్తి చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి ఎందరో నిరాశ్రయులకు, దివ్యాంగులకు, వృద్ధులకు నీడనిస్తున్న ముత్యాల పోసి కుమార్ సత్య దంపతుల సేవలు అభినందనీయమని జియో ఎడ్యుకేషనల్ కరస్పాండెంట్ సెక్రటరీ బెన్నీ బాబు అన్నారు. గురువారం ధవలేశ్వరంలో ట్రస్ట్ అధ్యక్షుడు పోసి కుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆరవ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెన్ని బాబు హాజరై, కేక్ కట్ చేసి, వృద్ధులకు దివ్యాంగులకు నిరాశ్రయులకు పళ్ళు అందజేశారు.  జై కుమార్ జయప్రద దంపతులు ఏర్పాటు చేసిన భోజనాలు అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు పోసి కుమార్ మాట్లాడుతూ 2019 వ సంవత్సరంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, కరోనా కష్టకాలంలో ఎంతోమంది పేదలకు సహాయం అందించామని, నేటికీ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందని, సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కెవిఆర్ సాగర్, జియో ఎడ్యుకేషనల్ సిబ్బంది సుబ్రహ్మణ్యం, వృద్ధులు, దివ్యాంగులు, నిరాశ్రయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు