రూరల్ ఎస్సై శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం:: అక్టోబర్ 28వ తేదీ రాత్రి సుమారు 7.00 గంటల సమయం లో ధర్మవరం నుండి బత్తలపల్లి వెళ్ళు రోడ్ లో గొట్లూరు గ్రామం బిందెల ఫ్యాక్టరీ వద్ద ఒక గుర్తు తెలియని వాహనం ఒక గుర్తు తెలియని వ్యక్తి, వయసు సుమారు 50-55 సంవత్సరాలు ను గుద్ది అక్కడ నుండి వెళ్ళిపొయినది అని, ఈ ప్రమాదం లో అతనికి తీవ్ర గాయాలయినాయి అని, వెంటనే సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం అక్కడ నుండి అంబులెన్స్ లో అనంతపురము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమైనది అని,చికిత్స పొందుతూ అక్టోబర్ 30 ఉదయం అనంతపురము ప్రభుత్వ ఆసుపత్రి నందు మృతి చెందాడని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం అతని శవము అనంతపురము ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూము నందు కలదు అని, చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 50-55 సంవత్సరాలు ఉంటాయని, బ్లూ కలర్ రైన్ కోట్, తెలుపు రంగు ఫుల్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంటు, కాఫీ కలర్ కట్ డ్రాయర్ వేసుకొని ఉండి బట్టలు మాసి ఉన్నవి అని తెలిపారు. అతని తలపై, గడ్డం పై సుమారు 1 ఇంచు తెలుపు , నలుపు వెంట్రుకలు కలవు, అతని వద్ద పేరు వివరాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు అని తెలిపారు.అతని గురించి వివరాలు ఏమైనా తెలిస్తే రూరల్ సీఐ 9440796832 లేదా ఎస్సై 9440796834 ఫో న్ నంబర్లకు సమాచారం ఇవ్వవలసిందిగా వారు తెలిపారు.
ఆచూకీ తెలపండి
- Advertisement -
RELATED ARTICLES


